MANAAPMS

Monday, September 1, 2014

మోడల్ అధ్యాపకులకు , అంతర్జాల మిత్రులకు ఎమ్.ఎస్.టి.ఎ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

మోడల్ అధ్యాపకులకు , అంతర్జాల మిత్రులకు ఎమ్.ఎస్.టి.ఎ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

======================================================================
2013 సెప్టెంబర్ 1 న ఉద్యమాలకు పురిటి గడ్డ ఐన ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అతికొద్దిమందితో 
మొదలైన ఎం.ఎస్.టి.ఎ ప్రస్థానం ...ఇంతింతై వటుడింతై....అన్న చందాన ప్రతి జిల్లాలో ....
ప్రతి స్కూళ్ళో.... సమస్య ఎక్కడున్నా నేను సహితం....సమస్యాగ్నికి సమిధనొక్కటి. ఆహుతిచ్చాను ..
నేనుసహితం విశ్వసృస్టికి ప్రశ్ననొక్కటి సంధించాను....అంటూ ఈ సువిశాల సమస్యల జగతిలో తానొక పోరాట నినాదాన్ని మోసుకుంటూ తన ఒంటరి యాత్రలో ఎంతోమంది మోడల్ అధ్యాపకుల ఆలోచనలతో...
.నైతిక మద్దతుతో ...ఒక సంవత్సర శిశువు...ఎన్నో సమస్యలను అధికారుల ముందుంచింది....
ఆర్.ఎమ్.ఎస్.ఎ నుండి సచివాలయం దాకా 
ఎంతో మంది ఉన్నతాధికారులను కల్సి 
ఎన్నో వినతి పత్రాలను అందించింది....
సెప్టెంబర్ 25 న పి.ఆర్.సి కమీషనర్ పి.కె. అగర్వాల్ నుండి 
ఆర్.ఎమ్.ఎస్.ఎ ఎ.డి,జె.డి , సచివాలయంలోసి.ఎస్ దాకా ....మంత్రులు 
 ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ....ఉన్నతాధికారులందరిని కల్సి 
సమస్య పరిష్కారాలకోసం నిర్విరామ పోరాటం చేస్తోంది. ఈదశలో ఎన్నో సమస్యలను 
చాలా ధైర్యంతో ఎదుర్కొని నేను సహితం అంటూ ....మీ ముందు నిలబడింది.........
అలాంటి మీ ఇంటి దీపంలాంటి మీ / మన సంస్థ ఇంకా చాలా పోరాటాలు చేయాల్సి ఉంది....దానికి మీ సంపూర్ణ మద్ధతును కోరుకుంటూ..... ......
మీ... తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్సు అసోసియేషన్ రాష్ట్ర విభాగం & ఎమ్.ఎస్.టి.ఎ సాంకేతిక విభాగం