MANAAPMS

Friday, April 19, 2013

మొదటి దశలో ప్రారంభం కానున్న ఆదర్శ పాఠశాలల జాబితా

మొదటి దశలో ప్రారంభం కానున్న ఆదర్శ పాఠశాలల జాబితా ఈ లంకె లో దిగుమతి చేసుకోండి 
LIST OF MODEL SCHOOLS TO BE OPERATIONALISED FROM 2013 - 14

Sl.No. Name of the District
==============                                               Name of the Mandal
  
 ఆదిలాబాద్ జిల్లాలోని 14 ఆదర్శ పాఠశాలలు
=====================

                                                                
1 Adilabad
                                                                           Sirpur (U)
2 Adilabad
                                                                           Mancherial
3 Adilabad
                                                                            Kothapally
4 Adilabad
                                                                            Kasipeta
5 Adilabad
                                                                            Asifabad
6 Adilabad
                                                                            Mandamarri
7 Adilabad
                                                                           Dandepally
8 Adilabad
                                                                            Narnoor
9 Adilabad
                                                                            Jainath
10 Adilabad
                                                                             Adilabad



11 Adilabad
                                                                               Kuntala
12 Adilabad
                                                                             Bazar Hatnoor
13 Adilabad
                                                                                 Boath
14 Adilabad
                                                                             Gudi Hatnoor


Phase APMS Lists..District wise

LIST OF MODEL SCHOOLS TO BE OPERATIONALISED FROM 2013 - 14
Sl.No. Name of the District Name of the Mandal
------------------------------ -----------------------
 ఆదిలాబాద్ జిల్లాలోని 14 ఆదర్శ పాఠశాలలు
1 Adilabad Sirpur (U)
2 Adilabad Mancherial
3 Adilabad Kothapally
4 Adilabad Kasipeta
5 Adilabad Asifabad
6 Adilabad Mandamarri
7 Adilabad Dandepally
8 Adilabad Narnoor
9 Adilabad Jainath
10 Adilabad Adilabad
11 Adilabad Kuntala
12 Adilabad Bazar Hatnoor
13 Adilabad Boath
14 Adilabad Gudi Hatnoor
======================================
 అనంతపూర్ జిల్లాలోని 25 ఆదర్శ పాఠశాలలు
15 Anantapur Tadipatri
16 Anantapur Yadiki
17 Anantapur Putlur
18 Anantapur Yellanur
19 Anantapur Garladinne
20 Anantapur Dharmavaram
21 Anantapur Uravakonda

22 Anantapur Vidapanakal
23 Anantapur Vajrakarur
24 Anantapur Gooty
25 Anantapur Pamidi
26 Anantapur Rayadurg
27 Anantapur Kanekal
28 Anantapur Kalyandurg
29 Anantapur Setture
30 Anantapur Rapthadu
31 Anantapur C.K.Palli
32 Anantapur Ramagiri
33 Anantapur Kanaganapalli
34 Anantapur Ammadagur
35 Anantapur Puttaparthi
36 Anantapur Nallacheruvu
37 Anantapur Hindupur
38 Anantapur Amarapuram
39 Anantapur Agali
======================================
 చిత్తూర్ జిల్లాలోని 18 ఆదర్శ పాఠశాలలు
40 Chittoor Yerravaripalem
41 Chittoor Rompicherlla
42 Chittoor K V Palli
43 Chittoor Kalakada
44 Chittoor K V B Puram
45 Chittoor Kuppam
46 Chittoor Gudupalli


47 Chittoor Santhipuram
48 Chittoor Baireddypalli
49 Chittoor Ramasamudram
50 Chittoor Punganur
51 Chittoor Kurabalakota
52 Chittoor Peddamandyam
53 Chittoor Thamballapalli
54 Chittoor Molakalacheruvu
55 Chittoor P.T.M.
56 Chittoor B. Kothakota
57 Chittoor Nimmanapalli
===========================
 తూర్పు గోదావరి జిల్లాలోని 2 ఆదర్శ పాఠశాలలు
58 East Godavari Sankavaram
59 East Godavari Tuni
=============================== 


60 Guntur Durgi
61 Guntur Karempudi
62 Guntur Veldurthy
63 Guntur Rentachintala
64 Guntur Dachepalli
65 Guntur Gurazala
66 Guntur Nekarikallu
67 Guntur Rompicherla
68 Guntur Krosuru
69 Guntur Nadendla
70 Guntur Ipur
71 Guntur Vinukonda
72 Guntur Nuzendla
73 Guntur Bollapalli
===========================================================================

74 Karimnagar Karimnagar
75 Karimnagar Bhimdevarapally
76 Karimnagar Elkathurthy
77 Karimnagar Saidapur
78 Karimnagar Chigurmamidi
79 Karimnagar Husnabad
80 Karimnagar Koheda
81 Karimnagar Shankarapatnam
82 Karimnagar Kamalapur
83 Karimnagar Jammikunta
84 Karimnagar Veenavanka
85 Karimnagar Thimmapoor
86 Karimnagar Manakondur
87 Karimnagar Ellanthakunta
88 Karimnagar Bejjenki
89 Karimnagar Kataram
90 Karimnagar Maha Mutharam
91 Karimnagar Malhar Rao
92 Karimnagar Manthani Mutharam
93 Karimnagar Sulthanabad
94 Karimnagar Julapally
95 Karimnagar Odela
96 Karimnagar Srirampur
97 Karimnagar Mallial
98 Karimnagar Gangadhara

99 Karimnagar Kodimial
100 Karimnagar Boinpally
101 Karimnagar Choppadandi
102 Karimnagar Ramadugu
103 Karimnagar Kathlapur
104 Karimnagar Medipally
105 Karimnagar Yellareddypet
106 Karimnagar Konaraopet
107 Karimnagar Gambhiraopet
108 Karimnagar Musthabad
109 Karimnagar Siricilla
110 Karimnagar Mallapur
111 Karimnagar Ibrahimpatnam
112 Karimnagar Korutla
113 Karimnagar Jagtial
114 Karimnagar Raikal
115 Karimnagar Ramagundam
116 Karimnagar Velgatoor
117 Karimnagar Dharmapuri
118 Karimnagar Gollapally
119 Karimnagar Dharmaram
120 Karimnagar Pegadapally
===================================
121 Khammam Singareni
122 Khammam Penubally
===================================
123 Krishna Gampalagudem
124 Krishna Reddygudem
====================================
125 Kurnool Kallur
126 Kurnool Orvakal
127 Kurnool Gadivemula
128 Kurnool Panyam
129 Kurnool C.Belgal
130 Kurnool Gudur
131 Kurnool Kodumur
132 Kurnool Gonegandla
133 Kurnool Nandavaram
134 Kurnool Yemmignur
135 Kurnool Pedda Kadabur
136 Kurnool Manthralayam
137 Kurnool Alur
138 Kurnool Aspari
139 Kurnool Maddikera (East)
140 Kurnool Pathikonda
141 Kurnool Jupadu Bungalow
142 Kurnool Midthur
143 Kurnool Pagidyala
144 Kurnool Pamulapadu
145 Kurnool Bandi Atmakur
146 Kurnool Mahanandi
147 Kurnool Velgode
148 Kurnool Nandyala
149 Kurnool Gospadu
150 Kurnool Bethamcherla
151 Kurnool Sirvel
152 Kurnool Allagadda
153 Kurnool Rudravaram
154 Kurnool Uyyalawada
155 Kurnool Banganapalli
156 Kurnool Kolimigundla
157 Kurnool Owk
158 Kurnool Dhone
159 Kurnool Krishnagiri
160 Kurnool Kosigi
======================================
161 Mahabubnagar Kosgi
162 Mahabubnagar Veldanda
163 Mahabubnagar Dhanwada
164 Mahabubnagar Kothakota
165 Mahabubnagar Khillaghanpur
166 Mahabubnagar Pebbair
167 Mahabubnagar Kodair

168 Medak Gajwel
169 Medak Mirdoddi
170 Medak Dubbak
171 Medak Siddipet
172 Medak Chinnakodure
173 Medak Nangnoor
174 Medak Kondapak
175 Medak Jagdevpur
176 Medak RC Puram
177 Medak Jinnaram
178 Medak Hathnoora
179 Medak Narsapur
180 Medak Shankarampet0R
181 Medak Shankarampet 0 A
182 Medak Manoor
183 Medak Jharasangam
184 Medak Pulkal
185 Medak Alladurg
186 Medak Raikode
187 Medak Munipalli
188 Medak Regode
189 Medak Tekmal
190 Medak Andole
191 Medak Ramayanpet
===================================
192 Nalgonda Chandampet
193 Nalgonda Chinthapally
194 Nalgonda Deverakonda
195 Nalgonda Gundlapally
196 Nalgonda PA Pally
197 Nalgonda Marriguda
198 Nalgonda Nampally
199 Nalgonda Bommalaramaram
200 Nalgonda M. Thurkapally
201 Nalgonda Pochampally
202 Nalgonda Gundala
203 Nalgonda Valigonda
204 Nalgonda Choutuppal
205 Nalgonda Narayanapur
206 Nalgonda Garidepally
207 Nalgonda Mattampally
208 Nalgonda Damarcherla
209 Nalgonda Miryalaguda
210 Nalgonda Vemulapally
211 Nalgonda Munagala
212 Nalgonda Nadigudem
213 Nalgonda Kethepally
214 Nalgonda Shaligouraram
215 Nalgonda Athmakur(S)
216 Nalgonda Thirumalagiri
217 Nalgonda Thungathurthy
218 Nalgonda Penpahad
219 Nalgonda Suryapet
220 Nalgonda Gurrampode
221 Nalgonda Nidmanoor
222 Nalgonda Kanagal
223 Nalgonda Thipparthy
224 Nalgonda Thripuraram
===============================
225 Nellore Kavali
226 Nellore Kondapuram
227 Nellore Kaligiri
228 Nellore Duttaluru
229 Nellore SeetaRamapuram
230 Nellore A.S.Pet
231 Nellore Marripadu
232 Nellore Venkatagiri
233 Nellore D.V.Stram
234 Nellore Tada
======================================
235 Nizamabad Armoor
236 Nizamabad Dharpally
237 Nizamabad Sirikonda
238 Nizamabad Sadashivnagar
239 Nizamabad Nagireddypet
240 Nizamabad Renjal
241 Nizamabad Navipet
242 Nizamabad Nizamsagar
243 Nizamabad Banswada
244 Nizamabad Varni
245 Nizamabad Yellareddy
246 Nizamabad Madnoor
247 Nizamabad Nandipet
248 Nizamabad Balkonda
249 Nizamabad Dichpally
250 Nizamabad Jakranpally
===============================-===
251 Prakasam Darsi
252 Prakasam Kanigiri
253 Prakasam Markapuram
254 Prakasam P.Dornala
255 Prakasam Racharla
256 Prakasam Chirala
257 Prakasam Mundlamur
258 Prakasam L.Samudram
259 Prakasam Kandukur
260 Prakasam Ulavapadu
261 Prakasam V.V.Palem
=================================
262 Ranga Reddy Manchal
263 Ranga Reddy Yacharam
264 Ranga Reddy Ibrahimpatnam
265 Ranga Reddy Kandukur
266 Ranga Reddy Maheshwaram
267 Ranga Reddy Shamshabad
268 Ranga Reddy Gandeed
269 Ranga Reddy Kulkacharla
270 Ranga Reddy Pargi
271 Ranga Reddy Basheerabad
272 Ranga Reddy Peddamul
273 Ranga Reddy Tandur
274 Ranga Reddy Pudur
275 Ranga Reddy Chevella
276 Ranga Reddy Shabad
277 Ranga Reddy Marpally
278 Ranga Reddy Bantwaram
279 Ranga Reddy Nawabpet
280 Ranga Reddy Shankerpally
=================================
281 Srikakulam Burja
282 Srikakulam Laveru
283 Srikakulam Laveru
284 Srikakulam Bhamini
285 Srikakulam Pathapatnam
286 Srikakulam Ponduru
287 Srikakulam G.Sigadam
288 Srikakulam Ranastalam
289 Srikakulam Jalumuru
290 Srikakulam Polaki
291 Srikakulam Kavity
292 Srikakulam Itchapuram
293 Srikakulam Sompeta
294 Srikakulam Kanchili
======================================
295 Visakhapatnam Raavikamatham
296 Visakhapatnam Cheedikada
297 Visakhapatnam Kasimkota
298 Visakhapatnam Munagapaka
299 Visakhapatnam Narsipatnam
======================================
300 Vizianagaram Vizianagaram
301 Vizianagaram Kothavalasa
302 Vizianagaram L Kota
303 Vizianagaram Vepada
304 Vizianagaram Denkada
305 Vizianagaram Bhogapuram
306 Vizianagaram Nellimarla
307 Vizianagaram Gantyada
308 Vizianagaram Merakamudidam
309 Vizianagaram Dattirajeru
310 Vizianagaram Logisa
311 Vizianagaram Mentada
312 Vizianagaram Therlam
313 Vizianagaram Saluru
314 Vizianagaram Makkuvu
315 Vizianagaram Kurupam
====================================
316 Warangal Bachannapet
317 Warangal Jangaon
318 Warangal Narmetta
319 Warangal Cheriyal
320 Warangal Maddur
321 Warangal Chityal
322 Warangal Ghanpur Mulugu
323 Warangal Mogullapally
324 Warangal Mulugu
325 Warangal Govindaraopet
326 Warangal Venkatapur
327 Warangal Parvathagiri
328 Warangal Nekkonda
329 Warangal Sangem
330 Warangal Budharaopet
331 Warangal Geesugonda
332 Warangal Chennaraopet
333 Warangal Maripeda
334 Warangal Narsimhulapet
335 Warangal Mahabubabad
336 Warangal Kuravi
337 Warangal Dornakal
338 Warangal Kesamudram
339 Warangal Nellikuduru
340 Warangal Raghunathpally
341 Warangal Kodakandla
342 Warangal Ghanpur (Stn)
343 Warangal Zaffergadh
344 Warangal Lingala Ghanpur
345 Warangal Thorrur
======================================
346 kadapa L.R.Palli
347 kadapa Chinnamandem
348 kadapa Rayachoty
349 kadapa Ramapuram
350 kadapa Sambepalli
351 kadapa Penagalur
352 kadapa Pullampet
353 kadapa Khajipet
354 kadapa Valluru
355 kadapa Kasinayana
==================================
ABSTRACT SHOWING DISTRICT WISE MODEL
SCHOOLS UNDER PHASE I

SL.NO DISTRICT
SANCTIONED IN
PHASE I
1 Srikakulam 14
2 Vizianagaram 16
3 Visakhapatnam 5
4 East Godavari 2
5 Krishna 2
6 Guntur 14
7 Prakasam 11
8 Nellore 10
9 Chittoor 18
10 Kadapa 10
11 Ananthapur 25
12 Kurnool 36
13 Adilabad 14
14 Karimnagar 47
15 Warangal 30
16 Khammam 2
17 Mahabubnagar 7
18 Ranga Reddy 19
19 Medak 24
20 Nizamabad 16
21 Nalgonda 33
TOTAL
355
 




టి.జి.టి ,పి.జి.టి , ప్రిన్సిపాళ్ళ నియామకాల మార్గదర్శక నియమావళి :G.O.Ms25 (Apr-04)(GUIDELINES FOR THE SELECTION OF TGT,PGT&PRINCIPALS)

G.O.Ms25 (Apr-04)(GUIDELINES FOR THE SELECTION OF TGT,PGT&PRINCIPALS)
టి.జి.టి ,పి.జి.టి , ప్రిన్సిపాళ్ళ నియామకాల మార్గదర్శక నియమావళి....ఈ లంకె లో దిగుమతి చేసుకోండి

నమస్తే తెలంగాణ ..దినపత్రిక .... తెలుగుమీడియం అభ్యర్థులకు సుప్రీం ఊరట

ఆదర్శ పాఠశాలలు  : తెలుగుమీడియం అభ్యర్థులకు ఊరట :సూర్య దినపత్రిక
న్యూఢిల్లీ : మోడల్‌ స్కూళ్లలో తెలుగు మీడియం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 
వెంటనే తెలుగు మీడియం ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలుగుమీడియం అభ్యర్థులు ఎందుకు అనర్హులో 2వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.  
ఢిల్లీ: మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యర్థుల ఫలితాలను ప్రకటించాలని కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు అనర్హులో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

నమస్తే తెలంగాణ ..దినపత్రిక ....
తెలుగుమీడియం అభ్యర్థులకు సుప్రీం ఊరట
ఢిల్లీ: మోడల్ స్కూల్ తెలుగుమీడియం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగుమీడియం అభ్యర్థుల ఫలితాలు ప్రకటించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులకు తెలుగు మీడియం అభ్యర్థులు అనర్హులంటూ ఇచ్చిన జీవోపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు మాధ్యమం అభ్యర్థులకు ఊరట: 
                  సాక్షి..దినపత్రిక 
ఢిల్లీ: మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యర్థుల ఫలితాలను ప్రకటించాలని కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు అనర్హులో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఢిల్లీ: మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యర్థుల ఫలితాలను ప్రకటించాలని కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు అనర్హులో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఆదర్శ పాఠశాలల సమాచారం :4 @ :కార్యక్రమ అమలు

కార్యక్రమ అమలు
ఆరు వేల ఆదర్శ పాఠశాలలో 2500 పాఠశాలలు విద్యా పరంగా వెనుకబడి ఉన్న మండలాల్లో కేంద్రీయ విద్యాలయ మాదిరిగా ఏర్పాటు చేస్తారు. మరోక 2500 పాఠశాలలు ప్రభుత్వ-పబ్లిక్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తారు. మిగతా 1000 పాఠశాలలకు ఎలా ఏర్పాటు చేయాలో ఇంకా విధివిధానాలు నిర్ణయించలేదు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయ మాదిరి 2500 ఆదర్శ పాఠశాలల
ప్రాంతము విద్యా పరంగా వెనుకబడిన మండలాల్లో 2500 పాఠశాలలు ఏర్పాటు చేస్తారు
భూమి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలల ఏర్పాటు చేయడానికి భూమిని అందిస్తుంది.
పాఠశాలల ఎంపిక భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలవారీగా ఆదర్శ పాఠశాలల సంఖ్యను నిర్ణయిస్తుంది. దాని తరువాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలా లేదా ఉన్న పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ది చేయడమా అనే విషయంలో నిర్ణయం చేయవచ్చు.
మాధ్యమం ఏ మీడియం లో చదువు భోదించాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికిచ్చేశారు. కాని ఇంగ్లీషు లో భోధించుట, మాట్లాడే ఇంగ్లీషు నేర్పించుట వంటి విషయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.
తరగతులు – ఈ ఆదర్శ పాఠశాలలు ఒక వేళ పాఠశాల ఇంగ్లీషు మాధ్యమంలో నిర్వహిస్తున్నట్లయితే ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు (VI to XII) ఉంటుంది. ప్రతి తరగతి రెండు సెక్షనులను కల్గి ఉంటుంది. ఒక వేళ పాఠశాల స్థానిక భాషలో నిర్వహిస్తున్నట్లయితే అక్కడ IX నుండి XII నిర్వహిస్తారు.
యాజమాన్యం ,నిర్వహణ – ఈ పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాల మాదిరిగానే రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తుంది.
నిర్మాణం
  • రాష్ట్ర సంస్థల ద్వారా ఈ ఆదర్శ పాఠశాలల భవణాల నిర్మాణం జరుగుతుంది
  • వీటికి సంబంధించిన నియమ నిభందనలు కేంద్రీయ విద్యాలయం లేదా రాష్ట్ర పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు అందిస్తుంది
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ వ్యక్తులచే నియమ నిభందనల ప్రకారం భవన నిర్మాణం చేపట్టవచ్చు
అడ్మిషన్
  • కేంద్రీయ విద్యాలయాలు నిర్వహించే మాదిరిగానే విద్యార్థుల అడ్మిషన్ కొరకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర రిజర్వేషన్ రూల్సు ఈ అడ్మిషన్ విషయంలో అవలంబిస్తారు.
  • ఈ పాఠశాల భవనాలు భూకంపాలకు తట్టుకునేతట్టుగా, అగ్ని ప్రమాదాలను నుండి భద్రత ఉండే విధంగా నిర్మిస్తారు.
  • ప్రకృతి వనరుల నుండి జనించే ఇంధన వనరులు మరియు సౌరశక్తి నుండి వచ్చే ఇంధన వనరుల ద్వారా శక్తిని ఉపయోగించుకునేటట్టు భవణాలు నిర్మించబడతాయి.

ఆదర్శ పాఠశాలల సమాచారం : 3 @ కేంద్రియ విద్యాలయాల నియమాలతో ఏర్పాటు చేస్తున్న 2500 పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర

కేంద్రియ విద్యాలయాల నియమాలతో ఏర్పాటు చేస్తున్న 2500 పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర
  • పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వాలతో ఏర్పాటు కాబడి, వాటితో నిర్వహించబడతాయి. ఈ పాఠశాలలు కొత్తగా ఏర్పాటు కావచ్చు లేదా ఉన్న పాఠశాలలనే ఆదర్శ పాఠశాలలుగా మార్చవచ్చు.
  • రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రభుత్వాలు కేంద్రీయ విద్యాలయాలు మాదిరి సోసైటీలను ఏర్పాటు చేసి, ఈ పాఠశాలలను వాటికి అనుసందానం చేయాలి
  • రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఈ పాఠశాలలకు అవసరమైన ప్రదేశంలో భూమిని అందించాలి.
  • ప్రతి రాష్ట్రం ఈ పధకాన్ని నిర్ణయించిన కాలంలో పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళిక ను రూపోందించాలి.
  • కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ నియమాలలో నిర్ణయించిన కనీసంగా కావలసిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. భూమి అందుబాటులోలేని పక్షంలో కొంచెం వెసులు బాటు కల్పించవచ్చు.
  • పాఠశాలలు విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలలో మరియు షెడ్యూల్ V ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పనిచేస్తున్న పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా మార్చుతున్నట్లయితే ముందుగా అక్కడ ఉన్న ఆశ్రమ పాఠశాలలకు అవకాశం ఇవ్వాలి.
  • రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోసైటీల ద్వారా భవణాలు నిర్మించబడతాయి మరియు వాటి ద్వారా నిర్వహించబడతాయి.  రాష్ట్ర వాటాగా మూలధన వ్యయాన్ని ఈ సోసైటీలలో జమ చేయాలి
  • ప్రభుత్వ- ప్రవేట్ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టవచ్చు. నిర్వహణ చేయవచ్చు సమాన నిష్పత్తితో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చెల్లింపును చేయవచ్చు.
  • రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర పర్యవేక్షణ కమిటిలో కేంద్ర ప్రభుత్వ సిబ్బంది సభ్యులుగా ఉంటారు.
  • తాత్కాలికంగా పాఠశాలలు పనిచేయడానికి అందుబాటులోఉన్న సదుపాయలను కేంద్రీయ విద్యాలయాలకు , సోసైటీలకు అందిస్తే అవి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయి.

ఆదర్శ పాఠశాలల సమాచారం : 2

వ్యయం నియమాలు
  • కేంద్రియ విద్యాలయ మాదిరి పాఠశాలలను నిర్మించడానికి, అంటే VI నుంది XII తరగతులకు , ప్రతి తరగతికి రెండు సెక్షన్లులకు కలిపి మొత్తానికి అయ్యే నిర్మాణ వ్యయం రూ. 3.02 కోట్లు అవుతుందని కేంద్రియ విద్యాలయ సంఘటన్ అంచనా వేసింది. సంవత్సరానికి అయ్యే రికరింగు వ్యయం సుమారు రూ. 0.75 కోట్లు.
  • ప్రస్తుతం నిర్మాణ, ఏర్పాటుకు అవుతున్న ఖర్చు ఆధారంగా ఈ అంచనా వేయడం జరిగింది.
  • ప్రాంతాన్ని బట్టి సెంట్రల్ పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు వారు నిర్ణయించిన రేట్ల ప్రకారం కేంద్రియ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు మరియు రాష్ట్ర సెక్టారు పాఠాశాలలు అయ్యే వాస్తవ ఖర్చు వ్యయాన్ని నిర్ణయిస్తారు. పైన చెప్పిన నియమాలు కేవలం అంచనా మాత్రమే

ఆదర్శ పాఠశాలల సమాచారం : 1

2009-10 తాత్కాలిక బడ్జెట్‌లో ` 312.90 కేటాయింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్లాక్‌ స్థాయిలో మెరుగైన విద్యను అందించేందుకు 6 వేల మోడల్‌ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 2009-10 తాత్కాలిక బడ్జెట్‌లో ` 312.90 కోట్లను కేటాయించార . 2007 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బ్లాక్‌స్థాయిలో 6 వేల ఉన్నత ప్రమాణాల పాఠశాలల ఏర్పాటును ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రస్తావించారు. దీనితో బడ్జెట్‌లో వీటికి ప్రాధాన్యం లభించింది. ఈదఫా విద్యారంగానికి ` 41,978.21 కోట్లను కేటాయించారు. 2008-09 బడ్జెట్‌లో కేటాయించిన ` 37,366.57కోట్ల కంటే ఇది ` 4,611 కోట్లు ఎక్కువ. ఇందులో పాఠశాల విద్యకు ` 28,799.21 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యకు ` 13,179 కోట్లు దక్కాయి. మదర్సాలలో నాణ్యమైన విద్యను అందించే పథకానికి ఈ బడ్జెట్‌లో ` 45 కోట్లు కేటాయించగా, మైనార్టీ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల మెరుగుకు ` 4.50 కోట్లు దక్కింది. మాధ్యమిక విద్య(సెకండరీ)ను బలోపేతం చేసేందుకు రాష్ట్రీయ మాధ్యమిక్‌ శిక్షా అభియాన్‌ (ఆర్‌ ఎమ్ ఎస్‌ ఏ) అనే నూతన పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ` 1,143.46 కోట్లు కేటాయించారు. సర్వశిక్షా అభియాన్‌ పథకం వల్ల ప్రాథమికోన్నత విద్యలో విద్యార్థుల సంఖ్య అంచనాలకు మించి పెరిగిపోవడంతో ఆ డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా ఆర్‌ ఎం ఎస్‌ ఏ పథకానికి రూపకల్పన చేశారు. విశ్వవిద్యాలయ నిధుల కమిషన్‌ (యూ జీ సీ)కి ఈ దఫా ` 6,545.11 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు ` 5,482.36 కోట్లతో పోలిస్తే ఇది ` 1,062.75 కోట్లు అదనం. దేశంలో నూతనంగా 15 కేంద్రీయ విశ్వవిద్యాలయాల స్థాపనకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను జారీచేసినట్లు కేంద్రం ప్రకటించింది. త్వరలోనే ఇవి ప్రారంభంకానున్నాయి. 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త ఐ ఐ టీ లను.. బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒరిస్సా, పంజాబ్‌, గుజరాత్‌లో ప్రారంభించారు. మరో రెండు ఐ ఐ టీ లు మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ, భోపాల్‌ ఆర్కిటెక్‌కళాశాలల్లో 2009-10 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

వచ్చేవారంలో ‘ఆదర్శ’ నియామక ప్రక్రియ ఆరంభం!

 ఈనాడు మెయిన్ ఎడిషన్ పేజి నంబర్ :9
ఏప్రిల్ 20 ,2013

వచ్చేవారంలో ‘ఆదర్శ’ నియామక ప్రక్రియ ఆరంభం!

ముందు టీజీటీ, పీజీటీ జాబితా వెల్లడి

హైదరాబాద్: ఆదర్శ పాఠశాలల నియామకాల్లో భాగంగా ముందు టీజీటీ, పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు రాత పరీక్షల్లో సాధించిన మార్కులను బట్టి వచ్చేవారం జాబితాను ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ నియామకాలు పూర్తయిన వెంటనే ప్రిన్సిపాళ్ల పోస్టులను భర్తీ చేయాలని అనుకుంటోంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించినందున అభ్యర్థుల అర్హతలు, కుల ధ్రువీకరణ వివరాల్లో విశ్వసనీయత ఎంత? వాటి పరిశీలనకు అభ్యర్థులను ఏ పద్ధతిలో పిలవాలన్న దానిపై విద్యాశాఖలో తర్జన భర్జన జరుగుతోంది. మరోవైపు తెలుగు మాధ్యమం అభ్యర్థుల ఫలితాలను విడుదల చేయాలని, వీరిని ఉద్యోగాలకు అనుమతించే విషయమై మే 8 లోపు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు విద్యాశాఖను ఆదేశించింది. దీనివల్ల నియామకాల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగదని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి సమాధానం పంపించాలని విద్యాశాఖ యోచిస్తోంది.
                                                                 ఈనాడు మెయిన్ ఎడిషన్ పేజి నంబర్ :9
                                                                            ఏప్రిల్ 20 ,2013  

నాణ్యతే ప్రమాణంగా ఆరు వేల బ్లాకులలో ఆదర్శ పాఠశాలల ఏర్పాటు

నాణ్యతే ప్రమాణంగా ఆరు వేల బ్లాకులలో ఆదర్శ పాఠశాలల ఏర్పాటు

2007 స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో మన భారత ప్రధాని మాట్లాడుతూ...
"విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను మన రాష్ట్రాలను కోరుతున్నాను. విద్య ఒక్కటే మన సమాజాన్ని విజయవంతంగా, సంపదతో నిర్మించగలదు. అదే విధముగా రాష్ట్రాలకు ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైన ఆదాయ వనరులను పెంచుకోవచ్చు. మీరు తప్పనిసరిగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇది పూర్తి చేయడానికి మన దేశంలో మంచి నాణ్యతా ప్రమాణాలతో పాఠశాలలను ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం నిర్ణయించినది. కొత్తగా ప్రారభించబోయే ఆరు వేల నాణ్యతా ప్రమాణాల పాఠశాలలకు మనము చేయూత నివ్వబోతున్నాము. అందులో భాగంగా ఒక్కొక్క బ్లాకు లేదా మండలంలో ఒక్కొక్క పాఠశాల స్థాపిస్తారు. అలా స్థాపించిన పాఠశాల ముందుగా పెట్టుకున్న ప్రమాణాలతో పనిచేసి ఆ బ్లాకు లేదా మండలము పరిధిలో ఉన్న మిగతా పాఠశాలలకు మార్గదర్శగా పనిచేస్తుంది "

Districts News » Viziayanagaram » మోడల్!

Districts News » Viziayanagaram »

మోడల్!

పార్వతీపురం: ఆదర్శ (మోడల్) పాఠశాలల ఏర్పాటుపై ప్రభుత్వం తగిన శ్రద్ధ వహించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదర్శ పాఠశాలల్లో పనిచేసేందుకు వీలుగా ఎంపిక కార్యక్రమం పూర్తిచేసింది. అయినప్పటికీ వీరి నియామకాలకు సంబంధించి ఇంతవరకు స్పందన కన్పించడం లేదు. ఇదే మాదిరిగా పాఠశాలల నిర్మాణం పరిస్థితి తయారైంది. జిల్లావ్యాప్తంగా గుమ్మలక్ష్మీపురం మినహా అన్ని మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మండలస్థాయిల్లో స్పందన అం తంత మాత్రంగా కన్పించడంతో కుదించింది. ఇప్పుడు ఏకంగా స్థల సమస్య తెరపైకి రావడంతో కొన్ని మండలాల్లో మాత్రమే ఆదర్శ పాఠశాలలకు అవకాశం లభించనుంది. అనేక మండలా ల్లో స్థలం చూపకపోవడంతో ఈ పాఠశాలలు దూరం కానున్నాయి. జియ్యమ్మవలసతో సహా అనేక మండలాల్లో స్థలాన్ని చూపలేక పాఠశాలలను ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. ఆదర్శ పాఠశాలకు కనీసం ఐదెకరాల స్థలం ఉండాలని నిబంధన విధించడంతో కొద్ది మండలాలు మాత్రమే ముందుకు వచ్చి నిర్మాణాలను నిర్వహిస్తున్నారు.

ఇలా ముందుకు వచ్చి పాఠశాలల నిర్మాణం చేపట్టిన మండలాల్లో కూడా తగిన పురోగతి కన్పించడం లేదు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందించగలరో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కురుపాం లో మంజూరైన ఆదర్శ పాఠశాల భవన నిర్మాణం ప్రారంభమైంది. రెండో అంతస్తు పనులు ప్రస్తు తం జరుగుతున్నాయి. అనేకచోట్ల ఇంకా పనులు మొదటి దశ భవన నిర్మాణ స్థాయిలోనే ఉన్నట్లు సమాచారం.

ఆదర్శ పాఠశాలలు ఎందుకంటే: ఆదర్శ పాఠశాలలను ఆరు నుంచి ఇంటర్ వరకు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్‌లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి విద్యార్థులకు మరింత ఉత్తమ విద్య అందించేందుకు కృషి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా ఇంగ్లీష్ మాధ్యమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.

తెలుగు మాధ్యమ ఉపాద్యాయులకు అవకా శం కల్పించాలని అప్పట్లో డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం తలవంచలేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇం టర్ వరకు ఆదర్శ పాఠశాలను నడపాలన్నది ఉద్దేశం. మాధ్యమిక విద్యను ఇంటర్ వరకు గుర్తించి ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాఠశాలలు ఏర్పాటైతే ఇంగ్లీషు మాధ్యమ సమస్య కొంతవరకు నెట్టుకురావచ్చు.

అయితే ప్రస్తుతం మండలాల్లో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సక్సెస్ పాఠశాలల నుంచి వస్తున్న విద్యార్థులు ఇంటర్‌లో ఇంగ్లీష్ మీడియంలో చదివేందుకు ఇబ్బందులు తప్పేలా లేదు.. ఎందుకంటే కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆదర్శ పాఠశాలలు ఆరో తరగతి నుంచి ప్రారంభం కావడం వల్ల ఈ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకే ఇంటర్‌లో కూడా అవకాశం ఉంటుంది. అయితే సీట్లు ఖాళీగా ఉన్న ప్రాప్తికి మాత్రమే బయటి పాఠశాలల నుంచి చదువుకున్న విద్యార్థులకు ఇంటర్‌లో చేరేందుకు అవకాశం ప్రస్తుతానికి ఉన్నట్లే. ఏది ఏమైనప్పటికీ ఆదర్శ పాఠశాలలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

'ఆదర్శ'కు ఆదిలోనే అడ్డంకులు

'ఆదర్శ'కు ఆదిలోనే అడ్డంకులు


  • ఈ విద్యా సంవత్సరం ప్రారంభించలేమని చేతులెత్తేసిన ప్రభుత్వం
  • ఆందోళనలో విద్యార్థులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన 'ఆదర్శ' పాఠశాలలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. 2012 విద్యా సంవత్సరంలో మొదటి విడత పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం అధికారులు ఆన్‌లైన్‌లో విద్యార్థుల నుంచి దరకాస్తులు స్వీకరించారు. తీరా వచ్చే సరికి ఈ విద్యా సంవత్సరం మోడల్‌ విద్యాలయాలను ప్రారంభించలేమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి చేతులెత్తేసింది. పాఠశాలలో చదివేందుకు ఎంతో ఆశతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు చివరకు నిరాశ మిగిలింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ దేశ వ్యాప్తంగా నాలుగు వేల ఆదర్శ పాఠశాలలను మంజూరు చేసింది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం 80 శాతం వాట, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం వాట కేటాయించాల్సి ఉంది. మొదటి విడత ప్రారంభం కానున్న పాఠశాలలకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మంజూరు చేయలేదు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఆదర్శ పాఠశాలల భవనాల నిర్మాణం నత్తనడకన కొనసాగుతుంది. ఏడాది కిందటే పాఠశాల నిర్మాణాలకు పునాదుల వరకు పనులు చేపట్టి వదిలేశారు. ఈ విద్యా సంవత్సరం ఎలాగైన ప్రారంభించాలనే ఉద్దేశంతో మాధ్యమిక విద్యాశాఖ అధికారులు అద్దె భవనాల్లో ఆదర్శ పాఠశాలలను ప్రారంభించాలనే ప్రయత్నం ఫలించకపోవడంతో వారు చివరకు చేతులెత్తేశారు. కేంద్రీయ విద్యాలయాల తరహాలో ఇంగ్లీష్‌ మీడియం విద్యను అందించడానికి ప్రభుత్వం ఈ పాఠశాలలను ప్రవేశపెట్టింది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంగ్లీష్‌ మీడియం ఉపాధ్యాయులను సైతం ఎంపిక చేసింది. రాష్ట్రంలో మొదటి విడత 355 ఆదర్శ పాఠశాలలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని హంగులతో భవనాలు నిర్మించేందుకు ఒక్కొ భవనానికి రూ. 3కోట్లా 2లక్షలు కేటాయించారు. జిల్లాకు మొదటి విడతగా 7 ఆదర్శ పాఠశాలలు మంజూరు అయ్యాయి. అన్నిచోట్ల భవన నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల కేంద్రానికి ఆదర్శ పాఠశాల మంజూరు అయ్యింది. భవన నిర్మాణం పునాదులకే పరిమితమైంది. ఈ పాఠశాలలో అడ్మిషన్ల కోసం మండలానికి చెందిన దాదాపు 400 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందపోవడంతో విద్యార్థులు తలో దారీ చూసుకున్నారు. ఇదే తరహాలో జిల్లాలోని 7 ఆదర్శ పాఠశాలలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వెల్దండతో పాటు ధన్వాడ, పెబ్బేర్‌, కొత్తకోట, కోస్గి, కోడేరు, ఖిల్లగన్‌పూర్‌ మండలాలలో భవన నిర్మాణాలు నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆదర్శ పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి నోచుకోకపోవడం విమర్శలకు దారీ తీసింది. అధికారుల నిర్లక్ష్యంగా కారణంగానే ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభం కాలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సత్వరమే ఆదర్శ పాఠశాలల నిర్మాణం

EENADU:04/03/2013సత్వరమే ఆదర్శ పాఠశాలల నిర్మాణం

సీఎం ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాఠశాల విద్యా శాఖాధికారులను ఆదేశించారు. ఆదర్శ పాఠశాలల భవన నిర్మాణంపై మార్చి 3న సీఎం సమీక్ష నిర్వహించి, ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. 737 పాఠశాలలకు గాను 355 పాఠశాలల నిర్మాణం మొదటి దశలో పూర్తవుతుందని పేర్కొంది. ఇప్పటికే 164 పాఠశాల భవన సముదాయాల నిర్మాణం చివరి దశకు చేరిందని, 104 భవన సముదాయాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొంది. మొదటి దశలో మంజూరైన ఆదర్శఆదర్శ పాఠశాలలు వచ్చే జూన్ నుంచి ప్రారంభమవుతాయని సీఎం కార్యాలయo తెలిపింది

ఆదర్శ పాఠశాలల నిర్మాణంలో జాప్యం

  నమస్తే తెలంగాణ
ఆదిలాబాద్
ఆదర్శ పాఠశాలల నిర్మాణంలో జాప్యం
- ప్రారంభం కాని పనులు
- ప్రవేశాలకు దగ్గర పడుతున్న గడువు

టీన్యూస్, సంజయ్‌నగర్ : ఆదర్శ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ పాఠశాలలను ప్రారంభిస్తామని పేర్కొంది. దీంతో మెరుగైన ఉచిత ఆంగ్ల విద్య అందుబాటులోకి వస్తుందని తల్లిదంవూడులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా, జిల్లాలో నేటికీ ఎక్కడా ఈ పాఠశాలల భవనాల నిర్మాణ పనులే మొ లు పెట్టలేదు. ఈ క్రమంలో జూన్‌లో ఆదర్శ పాఠశాలలను ఎలా ప్రారంభిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. వివిధ కారణాలతో సక్సెస్ పాఠశాలలు విఫలం చెందాయి. ఈ నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమంతో విద్యార్థుల ముందుకు వస్తున్న ఈ ఆదర్శ పాఠశాలలు సమర్థవంతంగా నడవాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? తదితర అంశాలపై  
టీన్యూస్ ప్రత్యేక కథనం..

గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉచితంగా మెరుగైన ఆంగ్ల విద్య అందించేందుకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, ప్రత్యేక ట్రస్ట్ ద్వారా వీటిని నిర్వహించనుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఈ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో 14 మండలాల్లో ఈ పాఠశాలలను మంజూరు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి జిల్లాలోని ఈ మండలాల్లో వీటిని ప్రారంభించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు చెబుతూవస్తున్నా.. తాజాగా వెలువరించిన ఉపాధ్యాయ నియామక ప్రకటనలో ఈ పాఠశాలల పోస్టులను ప్రకటించడంతో పచ్చజెండా ఊపింది.

ఇవి తప్పనిసరి..

వచ్చే విద్యాసంవత్సరం జూన్‌లో తరగతులు ప్రారంభం కావాలి. ఈ లెక్కన అప్పటికల్లా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తికావాలి. ఈపాటికే నియామక ప్రకటన వెలువడింది. మే 10,11తేదీల్లో రాత పరీక్ష కాగానే త్వరగా ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. సీబీఎస్‌ఈ సిలబస్‌లో బోధించనున్న క్రమంలో ఎంపికైన ఉపాధ్యాయులకు పాఠశాలలు ప్రారంభమయ్యేలోపే ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉందని విద్యావేత్తల అభివూపాయం. నిర్ణీత వ్యవధిలోగా పాఠ్యపుస్తుకాలు రప్పించాలి. జూన్‌కల్లా భవన నిర్మాణంపూర్తికాకపోతే, అంతకు ముందే ప్రత్యామ్నాయ భవనాలపై దృష్టి సారించాల్సి ఉంది.

భవనాల నిర్మాణం పూర్తయ్యేనా..?
జిల్లాలోని 14 మండలాల్లో నిర్ధేశించిన చోట ఆదర్శ పాఠశాల భవనాలు నిర్మించాలి. వీటిలో స్థలాలను ఇంతకు ముందే గుర్తించారు. నిర్మాణపు పనుల్ని ఏపి విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ది సంస్థకు అప్పగించే ఆలోచనలో ఉన్నారు. ఒక్కో భవనానికి రూ.3.02 కోట్ల వంతున రూ.42.2 కోట్లు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇప్పటికీ ఎక్కడా భవననిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. స్థలాలు ఉన్నప్పటికి పనులువూపారంభంకాకపోవడానికి అధికారుల ఉదాసీన వైఖరే కారణమన్న విమర్శలున్నాయి.

డేస్కాలర్...అయితే ఎలా?
విద్యాశాఖ అధికారులకు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆదర్శ పాఠశాలల్లో బాలికలకు గురుకుల పద్దతిలో, బాలురకు డేస్కాలర్‌గా ప్రవేశం కల్పిస్తారు. ఈ విషయంలో పూర్తి స్పష్టత రాలేదు. ఒకవేళ బాలురకు డేస్కాలర్ పద్దతిలో ప్రవేశం కల్పిస్తే ఆశించిన ఫలితాలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదు. ఆయా మండలాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన బాలురకు ఇందులో ప్రవేశం కల్పిస్తే వారు బస్సులు, ప్రైవేటు వాహనాలపై ఆధారపడి పాఠశాలకు రావాల్సి ఉంటుంది. ఇది వారికి ఇబ్బందికరమే. దీని విధివిధానాలపై స్పష్టత రాలేదు. గురుకుల పద్దతిలోనే ఈ పాఠశాలల్ని నిర్వహించడం ఉత్తమమని, ఈ దిశగానే చర్యలు తీసుకోవాలని విద్యాభిమానులు కోరుతున్నారు.

ఆదర్శ స్కూళ్లకు మొండి చేయి


అదిలాబాద్

ఆదర్శ స్కూళ్లకు మొండి చేయి


  • 16/05/2012
ఆదిలాబాద్, మే 15: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న గ్రామీణుల చిన్నారులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు రాష్ట్రీయ మాద్యమిక శిక్ష అభియాన్ పథకం ద్వారా మంజూరయిన ఆదర్శ పాఠశాలల ఏర్పాటుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 2012-13 సంవత్సరంలో జిల్లాలో 52 మండలాల్లో భారీ అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ఆదర్శ స్కూళ్లకు కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జిల్లాకు తొలి విడతగా 14 ఆదర్శ పాఠశాలలు 2009లో మంజూరు కాగా, ముందు చూపుతో ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు 20 మంది బోధన, బోధనేతర సిబ్బంది చొప్పున పోస్టులను కూడా మంజూరు చేసింది. 14 ప్రిన్సిపాళ్ళు, 168 పిజిటి, మరో 98 టిడిటి, 196 బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరయ్యాయి. అయితే విద్యార్థుల ఎంపిక పాఠశాల కనీస అవసరాల కోసం ఒక్కో మండలానికి కోటి రూపాయల అంచనా వ్యయంతో భవన నిర్మాణాలకు కూడా ప్రభుత్వం రూ.44 కోట్లు విడుదల చేసింది. వీటిలో 18.76 కోట్లు వౌలిక వసతుల కల్పనకు, 26 కోట్లు భవన నిర్మాణాలకు కేటాయించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే జూన్ 13 నుండి విద్యాసంవత్సరం ప్రారంభంతోనే ఆదర్శ పాఠశాలలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించిన ప్రభుత్వం కనీస వసతులు లేని కారణంగా విద్యార్థుల అడ్మిషన్లు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24 నుండి విద్యార్థుల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయగా ఈ జాబితాలో ఆదిలాబాద్ జిల్లా లేక పోవడం గమనార్హం. ఆదర్శ పాఠశాలకు సంబంధించి పట్టణాల్లో నాలుగు ఎకరాలు, మండలాల్లో ఐదు ఎకరాలు స్థలం సేకరించి భవన నిర్మాణాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం గత రెండు నెలల క్రిందటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. స్థల సేకరణలో రెవెన్యూ శాఖల నిర్లక్ష్యం వల్ల 14 మండలాల్లో మాత్రమే స్థలం సేకరించి నివేదిక పంపారు. వీటిలో 3 మండలాలు మంచిర్యాల, గుడిహత్నూరు, జైనథ్ మాత్రమే భవన నిర్మాణానికి శంఖుస్థాపన జరిగాయి. 6 నుండి 12 తరగతుల వరకు ఆంగ్ల భాషపై విద్యాభ్యాసం కొనసాగించేందుకు ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వం మంజూరు చేసిన ఆదర్శ పాఠశాల భవనాలకు అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రహణం పట్టుకుంది. ఈ యేడు నుండి అద్దె భవనాల్లోనే పాఠశాలలు కొనసాగిస్తామని అధికారులు ప్రకటించినా, కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై స్పష్టమైన వైఖరి ప్రకటించక పోవడంతో పక్కా భవనాల్లో స్కూళ్ళు నడపాలని ఆదేశాలు జారీ కావడంతో రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు నీళ్ళు నమలాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల్లో కూడా ఆదర్శ పాఠశాలలపై అవగాహన లేక పోవడం కూడా ఈ నిర్లక్ష్యానికి కారణంగా తెలుస్తోంది. వెనుకబడిన జిల్లాలో విద్యాప్రమాణాలు మరింత వెనుకబడిపోయే పరిస్థితి ఏర్పడింది.
                                                                            శనివారం ఏప్రిల్ 20 2013
                                                                                           ఆంధ్రభూమి