ఆరు వేల ఆదర్శ పాఠశాలలో 2500 పాఠశాలలు విద్యా పరంగా వెనుకబడి ఉన్న
మండలాల్లో కేంద్రీయ విద్యాలయ మాదిరిగా ఏర్పాటు చేస్తారు. మరోక 2500
పాఠశాలలు ప్రభుత్వ-పబ్లిక్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తారు. మిగతా 1000
పాఠశాలలకు ఎలా ఏర్పాటు చేయాలో ఇంకా విధివిధానాలు నిర్ణయించలేదు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయ మాదిరి 2500
ఆదర్శ పాఠశాలలు
ప్రాంతము విద్యా పరంగా వెనుకబడిన మండలాల్లో 2500
పాఠశాలలు ఏర్పాటు చేస్తారు
భూమి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలల ఏర్పాటు
చేయడానికి భూమిని అందిస్తుంది.
పాఠశాలల ఎంపిక భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలవారీగా ఆదర్శ పాఠశాలల సంఖ్యను నిర్ణయిస్తుంది. దాని తరువాత
రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలా లేదా ఉన్న పాఠశాలలను
ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ది చేయడమా అనే విషయంలో నిర్ణయం చేయవచ్చు.
మాధ్యమం ఏ మీడియం లో చదువు భోదించాలనే విషయాన్ని
రాష్ట్ర ప్రభుత్వానికిచ్చేశారు. కాని ఇంగ్లీషు లో భోధించుట, మాట్లాడే
ఇంగ్లీషు నేర్పించుట వంటి విషయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.
తరగతులు – ఈ ఆదర్శ పాఠశాలలు ఒక వేళ పాఠశాల ఇంగ్లీషు
మాధ్యమంలో నిర్వహిస్తున్నట్లయితే ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు (VI
to XII) ఉంటుంది. ప్రతి తరగతి రెండు సెక్షనులను కల్గి ఉంటుంది. ఒక వేళ
పాఠశాల స్థానిక భాషలో నిర్వహిస్తున్నట్లయితే అక్కడ IX నుండి XII
నిర్వహిస్తారు.
యాజమాన్యం ,నిర్వహణ – ఈ పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాల
మాదిరిగానే రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తుంది.
నిర్మాణం
- రాష్ట్ర సంస్థల ద్వారా ఈ ఆదర్శ పాఠశాలల భవణాల నిర్మాణం
జరుగుతుంది
- వీటికి సంబంధించిన నియమ నిభందనలు కేంద్రీయ విద్యాలయం లేదా రాష్ట్ర
పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు అందిస్తుంది
- రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ వ్యక్తులచే నియమ నిభందనల ప్రకారం భవన
నిర్మాణం చేపట్టవచ్చు
అడ్మిషన్
- కేంద్రీయ విద్యాలయాలు నిర్వహించే మాదిరిగానే విద్యార్థుల అడ్మిషన్
కొరకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర రిజర్వేషన్ రూల్సు ఈ అడ్మిషన్
విషయంలో అవలంబిస్తారు.
- ఈ పాఠశాల భవనాలు భూకంపాలకు తట్టుకునేతట్టుగా, అగ్ని ప్రమాదాలను నుండి
భద్రత ఉండే విధంగా నిర్మిస్తారు.
- ప్రకృతి వనరుల నుండి జనించే ఇంధన వనరులు మరియు సౌరశక్తి నుండి వచ్చే
ఇంధన వనరుల ద్వారా శక్తిని ఉపయోగించుకునేటట్టు భవణాలు
నిర్మించబడతాయి.
|
No comments:
Post a Comment