ఏప్రిల్ 20 ,2013
వచ్చేవారంలో ‘ఆదర్శ’ నియామక ప్రక్రియ ఆరంభం!
ముందు టీజీటీ, పీజీటీ జాబితా వెల్లడి
హైదరాబాద్: ఆదర్శ పాఠశాలల నియామకాల్లో భాగంగా ముందు టీజీటీ, పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు రాత పరీక్షల్లో సాధించిన మార్కులను బట్టి వచ్చేవారం జాబితాను ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ నియామకాలు పూర్తయిన వెంటనే ప్రిన్సిపాళ్ల పోస్టులను భర్తీ చేయాలని అనుకుంటోంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించినందున అభ్యర్థుల అర్హతలు, కుల ధ్రువీకరణ వివరాల్లో విశ్వసనీయత ఎంత? వాటి పరిశీలనకు అభ్యర్థులను ఏ పద్ధతిలో పిలవాలన్న దానిపై విద్యాశాఖలో తర్జన భర్జన జరుగుతోంది. మరోవైపు తెలుగు మాధ్యమం అభ్యర్థుల ఫలితాలను విడుదల చేయాలని, వీరిని ఉద్యోగాలకు అనుమతించే విషయమై మే 8 లోపు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు విద్యాశాఖను ఆదేశించింది. దీనివల్ల నియామకాల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగదని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి సమాధానం పంపించాలని విద్యాశాఖ యోచిస్తోంది.
ఈనాడు మెయిన్ ఎడిషన్ పేజి నంబర్ :9
ఏప్రిల్ 20 ,2013
No comments:
Post a Comment