Districts News » Viziayanagaram »
మోడల్!
పార్వతీపురం: ఆదర్శ (మోడల్) పాఠశాలల
ఏర్పాటుపై ప్రభుత్వం తగిన శ్రద్ధ వహించడం లేదన్న ఆరోపణలు
వెల్లువెత్తుతున్నాయి. ఆదర్శ పాఠశాలల్లో పనిచేసేందుకు వీలుగా ఎంపిక
కార్యక్రమం పూర్తిచేసింది. అయినప్పటికీ వీరి నియామకాలకు సంబంధించి ఇంతవరకు
స్పందన కన్పించడం లేదు. ఇదే మాదిరిగా పాఠశాలల నిర్మాణం పరిస్థితి
తయారైంది. జిల్లావ్యాప్తంగా గుమ్మలక్ష్మీపురం మినహా అన్ని మండలాల్లో ఆదర్శ
పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మండలస్థాయిల్లో స్పందన అం తంత మాత్రంగా కన్పించడంతో కుదించింది. ఇప్పుడు ఏకంగా స్థల సమస్య తెరపైకి రావడంతో కొన్ని మండలాల్లో మాత్రమే ఆదర్శ పాఠశాలలకు అవకాశం లభించనుంది. అనేక మండలా ల్లో స్థలం చూపకపోవడంతో ఈ పాఠశాలలు దూరం కానున్నాయి. జియ్యమ్మవలసతో సహా అనేక మండలాల్లో స్థలాన్ని చూపలేక పాఠశాలలను ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. ఆదర్శ పాఠశాలకు కనీసం ఐదెకరాల స్థలం ఉండాలని నిబంధన విధించడంతో కొద్ది మండలాలు మాత్రమే ముందుకు వచ్చి నిర్మాణాలను నిర్వహిస్తున్నారు.
ఇలా ముందుకు వచ్చి పాఠశాలల నిర్మాణం చేపట్టిన మండలాల్లో కూడా తగిన పురోగతి కన్పించడం లేదు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందించగలరో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కురుపాం లో మంజూరైన ఆదర్శ పాఠశాల భవన నిర్మాణం ప్రారంభమైంది. రెండో అంతస్తు పనులు ప్రస్తు తం జరుగుతున్నాయి. అనేకచోట్ల ఇంకా పనులు మొదటి దశ భవన నిర్మాణ స్థాయిలోనే ఉన్నట్లు సమాచారం.
ఆదర్శ పాఠశాలలు ఎందుకంటే: ఆదర్శ పాఠశాలలను ఆరు నుంచి ఇంటర్ వరకు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్‌లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి విద్యార్థులకు మరింత ఉత్తమ విద్య అందించేందుకు కృషి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా ఇంగ్లీష్ మాధ్యమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.
తెలుగు మాధ్యమ ఉపాద్యాయులకు అవకా శం కల్పించాలని అప్పట్లో డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం తలవంచలేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇం టర్ వరకు ఆదర్శ పాఠశాలను నడపాలన్నది ఉద్దేశం. మాధ్యమిక విద్యను ఇంటర్ వరకు గుర్తించి ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాఠశాలలు ఏర్పాటైతే ఇంగ్లీషు మాధ్యమ సమస్య కొంతవరకు నెట్టుకురావచ్చు.
అయితే ప్రస్తుతం మండలాల్లో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సక్సెస్ పాఠశాలల నుంచి వస్తున్న విద్యార్థులు ఇంటర్‌లో ఇంగ్లీష్ మీడియంలో చదివేందుకు ఇబ్బందులు తప్పేలా లేదు.. ఎందుకంటే కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆదర్శ పాఠశాలలు ఆరో తరగతి నుంచి ప్రారంభం కావడం వల్ల ఈ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకే ఇంటర్‌లో కూడా అవకాశం ఉంటుంది. అయితే సీట్లు ఖాళీగా ఉన్న ప్రాప్తికి మాత్రమే బయటి పాఠశాలల నుంచి చదువుకున్న విద్యార్థులకు ఇంటర్‌లో చేరేందుకు అవకాశం ప్రస్తుతానికి ఉన్నట్లే. ఏది ఏమైనప్పటికీ ఆదర్శ పాఠశాలలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

No comments:
Post a Comment