న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్లాక్ స్థాయిలో మెరుగైన విద్యను
అందించేందుకు 6 వేల మోడల్ స్కూళ్లను ఏర్పాటు
చేయనున్నారు. ఇందుకోసం 2009-10 తాత్కాలిక బడ్జెట్‌లో
` 312.90 కోట్లను కేటాయించార . 2007
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బ్లాక్‌స్థాయిలో
6 వేల ఉన్నత ప్రమాణాల పాఠశాలల ఏర్పాటును ప్రధాని
మన్మోహన్‌సింగ్ ప్రస్తావించారు. దీనితో బడ్జెట్‌లో వీటికి ప్రాధాన్యం
లభించింది. ఈదఫా విద్యారంగానికి ` 41,978.21 కోట్లను
కేటాయించారు. 2008-09 బడ్జెట్‌లో కేటాయించిన `
37,366.57కోట్ల కంటే ఇది ` 4,611 కోట్లు
ఎక్కువ. ఇందులో పాఠశాల విద్యకు ` 28,799.21 కోట్లు
కేటాయించారు. ఉన్నత విద్యకు ` 13,179 కోట్లు దక్కాయి.
మదర్సాలలో నాణ్యమైన విద్యను అందించే పథకానికి ఈ బడ్జెట్‌లో `
45 కోట్లు కేటాయించగా, మైనార్టీ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల
మెరుగుకు ` 4.50 కోట్లు దక్కింది. మాధ్యమిక
విద్య(సెకండరీ)ను బలోపేతం చేసేందుకు రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్
(ఆర్ ఎమ్ ఎస్ ఏ) అనే నూతన పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ ఆర్థిక
సంవత్సరంలో ` 1,143.46 కోట్లు కేటాయించారు. సర్వశిక్షా
అభియాన్ పథకం వల్ల ప్రాథమికోన్నత విద్యలో విద్యార్థుల సంఖ్య అంచనాలకు
మించి పెరిగిపోవడంతో ఆ డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా ఆర్ ఎం ఎస్ ఏ
పథకానికి రూపకల్పన చేశారు. విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ (యూ జీ సీ)కి ఈ
దఫా ` 6,545.11 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం
కేటాయింపులు ` 5,482.36 కోట్లతో పోలిస్తే ఇది `
1,062.75 కోట్లు అదనం. దేశంలో నూతనంగా 15
కేంద్రీయ విశ్వవిద్యాలయాల స్థాపనకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను
జారీచేసినట్లు కేంద్రం ప్రకటించింది. త్వరలోనే ఇవి ప్రారంభంకానున్నాయి.
2008-09 ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త ఐ ఐ టీ లను..
బీహార్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, పంజాబ్, గుజరాత్‌లో
ప్రారంభించారు. మరో రెండు ఐ ఐ టీ లు మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో
అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ, భోపాల్ ఆర్కిటెక్‌కళాశాలల్లో
2009-10 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం
కానున్నాయి. |
No comments:
Post a Comment