నాణ్యతే ప్రమాణంగా ఆరు వేల బ్లాకులలో ఆదర్శ పాఠశాలల ఏర్పాటు
2007 స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో మన భారత ప్రధాని మాట్లాడుతూ...
"విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను మన రాష్ట్రాలను కోరుతున్నాను. విద్య
ఒక్కటే మన సమాజాన్ని విజయవంతంగా, సంపదతో నిర్మించగలదు. అదే విధముగా
రాష్ట్రాలకు ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైన ఆదాయ వనరులను
పెంచుకోవచ్చు. మీరు తప్పనిసరిగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి.ఇది పూర్తి చేయడానికి మన దేశంలో మంచి నాణ్యతా ప్రమాణాలతో పాఠశాలలను ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం నిర్ణయించినది. కొత్తగా ప్రారభించబోయే ఆరు వేల నాణ్యతా ప్రమాణాల పాఠశాలలకు మనము చేయూత నివ్వబోతున్నాము. అందులో భాగంగా ఒక్కొక్క బ్లాకు లేదా మండలంలో ఒక్కొక్క పాఠశాల స్థాపిస్తారు. అలా స్థాపించిన పాఠశాల ముందుగా పెట్టుకున్న ప్రమాణాలతో పనిచేసి ఆ బ్లాకు లేదా మండలము పరిధిలో ఉన్న మిగతా పాఠశాలలకు మార్గదర్శగా పనిచేస్తుంది "
news bagundi ekkada publish ayyindi
ReplyDelete