- ఈ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వాలతో ఏర్పాటు కాబడి, వాటితో
నిర్వహించబడతాయి. ఈ పాఠశాలలు కొత్తగా ఏర్పాటు కావచ్చు లేదా ఉన్న పాఠశాలలనే
ఆదర్శ పాఠశాలలుగా మార్చవచ్చు.
- రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రభుత్వాలు కేంద్రీయ విద్యాలయాలు మాదిరి
సోసైటీలను ఏర్పాటు చేసి, ఈ పాఠశాలలను వాటికి అనుసందానం చేయాలి
- రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఈ పాఠశాలలకు అవసరమైన ప్రదేశంలో
భూమిని అందించాలి.
- ప్రతి రాష్ట్రం ఈ పధకాన్ని నిర్ణయించిన కాలంలో పూర్తి చేయడానికి
అవసరమైన ప్రణాళిక ను రూపోందించాలి.
- కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ నియమాలలో నిర్ణయించిన కనీసంగా
కావలసిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. భూమి అందుబాటులోలేని పక్షంలో
కొంచెం వెసులు బాటు కల్పించవచ్చు.
- ఈ పాఠశాలలు విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలలో మరియు షెడ్యూల్ V
ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పనిచేస్తున్న పాఠశాలలను
ఆదర్శ పాఠశాలలుగా మార్చుతున్నట్లయితే ముందుగా అక్కడ ఉన్న ఆశ్రమ పాఠశాలలకు
అవకాశం ఇవ్వాలి.
- రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోసైటీల ద్వారా భవణాలు
నిర్మించబడతాయి మరియు వాటి ద్వారా నిర్వహించబడతాయి. రాష్ట్ర వాటాగా
మూలధన వ్యయాన్ని ఈ సోసైటీలలో జమ చేయాలి
- ప్రభుత్వ- ప్రవేట్ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం
చేపట్టవచ్చు. నిర్వహణ చేయవచ్చు సమాన నిష్పత్తితో కేంద్ర మరియు రాష్ట్ర
ప్రభుత్వాలు ఈ చెల్లింపును చేయవచ్చు.
- రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు
ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర పర్యవేక్షణ కమిటిలో కేంద్ర ప్రభుత్వ సిబ్బంది
సభ్యులుగా ఉంటారు.
- తాత్కాలికంగా పాఠశాలలు పనిచేయడానికి అందుబాటులోఉన్న సదుపాయలను
కేంద్రీయ విద్యాలయాలకు , సోసైటీలకు అందిస్తే అవి తమ కార్యకలాపాలను
ప్రారంభిస్తాయి.
|
No comments:
Post a Comment