MANAAPMS

Friday, April 19, 2013

ఆదర్శ పాఠశాలల నిర్మాణంలో జాప్యం

  నమస్తే తెలంగాణ
ఆదిలాబాద్
ఆదర్శ పాఠశాలల నిర్మాణంలో జాప్యం
- ప్రారంభం కాని పనులు
- ప్రవేశాలకు దగ్గర పడుతున్న గడువు

టీన్యూస్, సంజయ్‌నగర్ : ఆదర్శ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ పాఠశాలలను ప్రారంభిస్తామని పేర్కొంది. దీంతో మెరుగైన ఉచిత ఆంగ్ల విద్య అందుబాటులోకి వస్తుందని తల్లిదంవూడులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా, జిల్లాలో నేటికీ ఎక్కడా ఈ పాఠశాలల భవనాల నిర్మాణ పనులే మొ లు పెట్టలేదు. ఈ క్రమంలో జూన్‌లో ఆదర్శ పాఠశాలలను ఎలా ప్రారంభిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. వివిధ కారణాలతో సక్సెస్ పాఠశాలలు విఫలం చెందాయి. ఈ నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమంతో విద్యార్థుల ముందుకు వస్తున్న ఈ ఆదర్శ పాఠశాలలు సమర్థవంతంగా నడవాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? తదితర అంశాలపై  
టీన్యూస్ ప్రత్యేక కథనం..

గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉచితంగా మెరుగైన ఆంగ్ల విద్య అందించేందుకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, ప్రత్యేక ట్రస్ట్ ద్వారా వీటిని నిర్వహించనుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఈ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో 14 మండలాల్లో ఈ పాఠశాలలను మంజూరు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి జిల్లాలోని ఈ మండలాల్లో వీటిని ప్రారంభించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు చెబుతూవస్తున్నా.. తాజాగా వెలువరించిన ఉపాధ్యాయ నియామక ప్రకటనలో ఈ పాఠశాలల పోస్టులను ప్రకటించడంతో పచ్చజెండా ఊపింది.

ఇవి తప్పనిసరి..

వచ్చే విద్యాసంవత్సరం జూన్‌లో తరగతులు ప్రారంభం కావాలి. ఈ లెక్కన అప్పటికల్లా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తికావాలి. ఈపాటికే నియామక ప్రకటన వెలువడింది. మే 10,11తేదీల్లో రాత పరీక్ష కాగానే త్వరగా ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. సీబీఎస్‌ఈ సిలబస్‌లో బోధించనున్న క్రమంలో ఎంపికైన ఉపాధ్యాయులకు పాఠశాలలు ప్రారంభమయ్యేలోపే ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉందని విద్యావేత్తల అభివూపాయం. నిర్ణీత వ్యవధిలోగా పాఠ్యపుస్తుకాలు రప్పించాలి. జూన్‌కల్లా భవన నిర్మాణంపూర్తికాకపోతే, అంతకు ముందే ప్రత్యామ్నాయ భవనాలపై దృష్టి సారించాల్సి ఉంది.

భవనాల నిర్మాణం పూర్తయ్యేనా..?
జిల్లాలోని 14 మండలాల్లో నిర్ధేశించిన చోట ఆదర్శ పాఠశాల భవనాలు నిర్మించాలి. వీటిలో స్థలాలను ఇంతకు ముందే గుర్తించారు. నిర్మాణపు పనుల్ని ఏపి విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ది సంస్థకు అప్పగించే ఆలోచనలో ఉన్నారు. ఒక్కో భవనానికి రూ.3.02 కోట్ల వంతున రూ.42.2 కోట్లు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇప్పటికీ ఎక్కడా భవననిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. స్థలాలు ఉన్నప్పటికి పనులువూపారంభంకాకపోవడానికి అధికారుల ఉదాసీన వైఖరే కారణమన్న విమర్శలున్నాయి.

డేస్కాలర్...అయితే ఎలా?
విద్యాశాఖ అధికారులకు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆదర్శ పాఠశాలల్లో బాలికలకు గురుకుల పద్దతిలో, బాలురకు డేస్కాలర్‌గా ప్రవేశం కల్పిస్తారు. ఈ విషయంలో పూర్తి స్పష్టత రాలేదు. ఒకవేళ బాలురకు డేస్కాలర్ పద్దతిలో ప్రవేశం కల్పిస్తే ఆశించిన ఫలితాలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదు. ఆయా మండలాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన బాలురకు ఇందులో ప్రవేశం కల్పిస్తే వారు బస్సులు, ప్రైవేటు వాహనాలపై ఆధారపడి పాఠశాలకు రావాల్సి ఉంటుంది. ఇది వారికి ఇబ్బందికరమే. దీని విధివిధానాలపై స్పష్టత రాలేదు. గురుకుల పద్దతిలోనే ఈ పాఠశాలల్ని నిర్వహించడం ఉత్తమమని, ఈ దిశగానే చర్యలు తీసుకోవాలని విద్యాభిమానులు కోరుతున్నారు.

No comments:

Post a Comment