సత్వరమే ఆదర్శ పాఠశాలల నిర్మాణం
EENADU:04/03/2013సత్వరమే ఆదర్శ పాఠశాలల నిర్మాణం
సీఎం ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం
చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాఠశాల విద్యా శాఖాధికారులను
ఆదేశించారు. ఆదర్శ పాఠశాలల భవన నిర్మాణంపై మార్చి 3న సీఎం సమీక్ష
నిర్వహించి, ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. 737
పాఠశాలలకు గాను 355 పాఠశాలల నిర్మాణం మొదటి దశలో పూర్తవుతుందని పేర్కొంది.
ఇప్పటికే 164 పాఠశాల భవన సముదాయాల నిర్మాణం చివరి దశకు చేరిందని, 104 భవన
సముదాయాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొంది. మొదటి దశలో మంజూరైన
ఆదర్శఆదర్శ పాఠశాలలు వచ్చే జూన్ నుంచి ప్రారంభమవుతాయని సీఎం కార్యాలయo తెలిపింది
No comments:
Post a Comment