హైదరాబాద్:
ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్ల నియామకాల తీరుపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాతపరీక్ష, మౌఖిక పరీక్షలు దాటుకుని అర్హత ధ్రువీకరణ పత్రాల పరిశీలన సైతం పూర్తిచేసుకుని చిట్ట చివరన నియామక పత్రాలు అందుకోవడానికి కౌన్సెలింగ్‌కు వచ్చిన వారిలో 80 మందిని అధికారులు తిరస్కరించారు. నియామక ప్రకటనలో కోరిన విధంగా వీరికి తగినంత సీనియారిటీ లేనందునే నియామక పత్రాలు ఇవ్వలేదని అధికారులు చెపుతున్నారు. కానీ తమను కౌన్సిలింగ్ దాకా పిలిచి చివరిక్షణంలో అన్యాయం చేశారని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ పోస్టుల భర్తీకి జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మొత్తం 321 మందిని అధికారులు పిలిచారు. ఈ పోస్టుకు ఎంపిక కావాలంటే సీనియారిటీ అర్హతలను ఇలా నిర్ణయించారు. ఇంటర్మీడియెట్ కోర్సులు నిర్వహించే కళాశాలలో ప్రిన్సిపాల్‌గా ఇప్పటికే పనిచేస్తుండాలి లేదా ఐదేళ్లుగా వైస్ ప్రిన్సిపాల్‌గా లేదా జూనియర్ లెక్చరర్‌గా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా కనీసం ఐదేళ్లుగా పనిచేస్తుండాలి. ఈ అర్హతలను ధ్రువీకరించే పత్రాలు లేవని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ కౌన్సెలింగ్‌కు వచ్చిన వారిని తిరస్కరించారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేసేవారికి ప్రాధాన్యం ఇచ్చి తమకు అన్యాయం చేశారని వీరు విమర్శిస్తున్నారు. ఈ కౌన్సెలింగ్ సోమవారం కూడా కొనసాగనుంది.

No comments:
Post a Comment