అదిలాబాద్
ఆదర్శ స్కూళ్లకు మొండి చేయి
- 16/05/2012
TAGS:
ఆదిలాబాద్,
మే 15: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న గ్రామీణుల చిన్నారులకు
ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు రాష్ట్రీయ మాద్యమిక శిక్ష అభియాన్
పథకం ద్వారా మంజూరయిన ఆదర్శ పాఠశాలల ఏర్పాటుపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
2012-13 సంవత్సరంలో జిల్లాలో 52 మండలాల్లో భారీ అంచనా వ్యయంతో
నిర్మించతలపెట్టిన ఆదర్శ స్కూళ్లకు కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థుల
అడ్మిషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జిల్లాకు
తొలి విడతగా 14 ఆదర్శ పాఠశాలలు 2009లో మంజూరు కాగా, ముందు చూపుతో ప్రభుత్వం
ఒక్కో పాఠశాలకు 20 మంది బోధన, బోధనేతర సిబ్బంది చొప్పున పోస్టులను కూడా
మంజూరు చేసింది. 14 ప్రిన్సిపాళ్ళు, 168 పిజిటి, మరో 98 టిడిటి, 196
బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరయ్యాయి. అయితే విద్యార్థుల ఎంపిక పాఠశాల
కనీస అవసరాల కోసం ఒక్కో మండలానికి కోటి రూపాయల అంచనా వ్యయంతో భవన
నిర్మాణాలకు కూడా ప్రభుత్వం రూ.44 కోట్లు విడుదల చేసింది. వీటిలో 18.76
కోట్లు వౌలిక వసతుల కల్పనకు, 26 కోట్లు భవన నిర్మాణాలకు కేటాయించాలని
మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే జూన్ 13 నుండి విద్యాసంవత్సరం
ప్రారంభంతోనే ఆదర్శ పాఠశాలలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించిన ప్రభుత్వం
కనీస వసతులు లేని కారణంగా విద్యార్థుల అడ్మిషన్లు నిలుపుదల చేస్తూ
ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24 నుండి విద్యార్థుల ఎంపికకు సంబంధించి
మార్గదర్శకాలు జారీ చేయగా ఈ జాబితాలో ఆదిలాబాద్ జిల్లా లేక పోవడం గమనార్హం.
ఆదర్శ పాఠశాలకు సంబంధించి పట్టణాల్లో నాలుగు ఎకరాలు, మండలాల్లో ఐదు ఎకరాలు
స్థలం సేకరించి భవన నిర్మాణాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం గత రెండు నెలల
క్రిందటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. స్థల సేకరణలో
రెవెన్యూ శాఖల నిర్లక్ష్యం వల్ల 14 మండలాల్లో మాత్రమే స్థలం సేకరించి
నివేదిక పంపారు. వీటిలో 3 మండలాలు మంచిర్యాల, గుడిహత్నూరు, జైనథ్ మాత్రమే
భవన నిర్మాణానికి శంఖుస్థాపన జరిగాయి. 6 నుండి 12 తరగతుల వరకు ఆంగ్ల భాషపై
విద్యాభ్యాసం కొనసాగించేందుకు ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వం మంజూరు చేసిన
ఆదర్శ పాఠశాల భవనాలకు అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రహణం పట్టుకుంది. ఈ యేడు
నుండి అద్దె భవనాల్లోనే పాఠశాలలు కొనసాగిస్తామని అధికారులు ప్రకటించినా,
కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై స్పష్టమైన వైఖరి ప్రకటించక పోవడంతో పక్కా
భవనాల్లో స్కూళ్ళు నడపాలని ఆదేశాలు జారీ కావడంతో రెవెన్యూ, విద్యాశాఖ
అధికారులు నీళ్ళు నమలాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల్లో
కూడా ఆదర్శ పాఠశాలలపై అవగాహన లేక పోవడం కూడా ఈ నిర్లక్ష్యానికి కారణంగా
తెలుస్తోంది. వెనుకబడిన జిల్లాలో విద్యాప్రమాణాలు మరింత వెనుకబడిపోయే
పరిస్థితి ఏర్పడింది.శనివారం ఏప్రిల్ 20 2013
ఆంధ్రభూమి
bagundi sir mi information
ReplyDeletemalanti vallaku baga upayogamgaa undi
thanks for informations.. good post.. visite my article is site and site
ReplyDelete